“రంగమార్తాండ”..చీరలో మెరిసిపోతున్న అనసూయ

574
Anasuya In Rangamartanda
- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు రాలేదు. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమాలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు మంచి స్పందన వచ్చింది. అనసూయ నటన, అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కూడా ఆమె పలు సినిమాలకు సైన్ చేసింది.

ప్రస్తుతం అనసూయ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్‌కు సంబంధించిన లుక్‌‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నీలం రంగు చీరలో పూల మధ్యలో అనసూయ మెరిసిపోయింది. ‘కృష్ణ వంశీ సినిమాలు తనకెంతో ఆదర్శమని… ఆయన మూవీల్లో ఆడవారిని ఎంతో సహజంగా, మృదుస్వభావులుగా, బలంగా చూపిస్తారంది. ఆయన సెట్స్‌లో పనిచేయడం ఓ కల అని’ అనసూయ ట్వీట్ చేసింది. ఈమూవీలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటించగా బ్రహ్మనందం ముఖ్య పాత్రలో నటించనున్నాడు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రంగమార్తాండను తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -