సోనమ్ ఆరోగ్యంపై డాక్టర్లు

3
- Advertisement -

ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆయన పూర్తి స్పృహలో ఉన్నారని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబ తెలిపారు. అయితే సుదీర్ఘ నిరాహార దీక్ష కారణంగా ఆయన స్వల్ప డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) నీరసానికి గురయ్యారని పేర్కొన్నారు.

వాంగ్‌చుక్ ఉదయం 7:40 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి చేరుకున్నారని, వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.
ఆయనకు నిరంతరం పరీక్షలు చేస్తూ పర్యవేక్షిస్తున్నాము, చికిత్స కొనసాగుతోంది అని డాక్టర్ బాంబ తెలిపారు.

ఆయన పూర్తి అలర్ట్‌గా, స్థిరంగా ఉన్నారు. ఆసుపత్రికి వచ్చిన వెంటనే మొదట ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించింది, ఇప్పుడు ఆయనను మెడిసిన్ విభాగంలో చేర్చారు. ఆయన పూర్తి స్పృహలో ఉన్నారు, అన్ని పారామితులు సాధారణంగా ఉన్నాయి అని ఆమె చెప్పుకొచ్చారు.

డీహైడ్రేషన్ కారణంగా శరీరంలో తలెత్తిన ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను సరిదిద్దడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారని అందువల్ల వాంగ్‌చుక్‌ను మరికొంత కాలం పర్యవేక్షణలో ఉంచుతామని డాక్టర్ బాంబ చెప్పారు.

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం మరియు వైద్యుల సలహా మేరకే వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో అత్యంత సంయమనం పాటించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదంతో సహా దేశవ్యాప్తంగా పరీక్షల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

Also Read:‘మహేంద్రగిరి వారాహి’..విజయం సాధించాలి!

- Advertisement -