ఈ వర్షాకాలం చివరి దశకు రావడంతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి, దాంతో కొన్ని సీజనల్ వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఈ మద్య దేశ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. డెంగ్యూ బారిన పడిన వారిలో రోగనిరోదక శక్తి తగ్గడం, రక్తంలో ప్లేట్స్ కౌంట్ పడిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
డెంగీ సోకిన వ్యక్తికి ప్లేట్‌లెట్లు తగ్గితే అది ప్రమాదకరమని తెలిసిందే. అయితే తాజాగా దానికంటే ప్లాస్మా లీకేజీ మరింత ఎక్కువ ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీగా డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
డెంగీ వైరస్ సోకినప్పుడు రక్త నాళాల్లోని ఎండోథిలియం పొరలో వాపు వచ్చి వాటి మధ్యలో ఖాళీలు ఏర్పడతాయి. తద్వారా రక్తంలోని ప్లాస్మా లీకేజీ అవుతుందని తేలింది. అయితే ఫ్లాస్మా లీకేజీని కాళ్లు, కంటిచూట్టూ వాపు,రక్తంలో హెమటోక్రిట్ స్థాయులు పెరగడం వంటివి కనిపిస్తాయన్నారు. పల్స్, బీపీ పడిపోవడం
కాళ్లు, చేతులు చల్లబడటం,వాంతులు, కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటాయని తెలిపారు డాక్టర్లు. డెంగీ, గన్యా జ్వరాలు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయని, అందుకే దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యలు హెచ్చరిస్తున్నారు.
Also Read:BCCI: మహిళ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే