కడుపులో ఉన్న వస్తువులు చూసి షాకైన డాక్టర్లు..!

298
Doctors remove 116 iron nails
- Advertisement -

ఓ వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతున్న ఆస్పత్రిలో చేరాడు. అతనికి పరిశీలించిన డాక్టర్లు ఎక్స్ రే తీయగా.. కడుపులో ఏదో ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు.. ఆ వ్యక్తి కడుపులోంచి బయటపడ్డ వస్తువులు చూసి డాక్టర్లు షాకైయ్యారు. సదరు వ్యక్తి కడుపులో ఇనుప నట్లు, వైర్లు, ఇనుప గుండు వంటి వస్తువులు బయటపడ్డాయి. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

రాజస్థాన్‌లోని కోట జిల్లా బుండీ ప్రాంతానికి చెందిన భోలాశంకర్ (42) అనే ఈ వ్యక్తి కొద్ది రోజులుగా పొత్తి కడుపులో నొప్పి వస్తున్నదని ఆదివారం చికిత్స కోసం బుండీ ప్రభుత్వ దవాఖానకు వచ్చాడు. అతడి పొత్తి కడుపును ఎక్స్‌రే తీసినప్పుడు ఈ ఇనుప మేకులు ఉన్న సంగతి చూసి ఆశ్చర్యపోయానని దవాఖాన సర్జన్ డాక్టర్ అనిల్ షైనీ తెలిపారు. ఆ వెంటనే సిటీ స్కాన్ చేసినప్పుడు కడుపులో ఇనుప మేకులు ఉన్నాయని ధ్రువీకరించుకుని సోమవారం శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలిగించామని అనిల్ షైనీ తెలిపారు.

Doctors remove 116 iron nails

ఒక్కో ఇనుప మేకు పొడవు 6.5 సెం.మీ ఉంటుందని, ఇనుప మేకులు, వైరు, గోలీలను తొలిగించడానికి గంటన్నర సమయం పట్టిందన్నారు. శస్త్రచికిత్స తర్వాత రోగి పరిస్థితి నిలకడగా ఉన్నదని, చాలా బాగా మాట్లాడుతున్నాడన్నారు. భారీ మొత్తంలో ఇనుప గుళ్లు తన కడుపులోకి ఎలా వెళ్లాయో తెలియదని భోలా శంకర్ చెబుతున్నాడు. తోటమాలిగా పని చేస్తున్న భోలాశంకర్ పొత్తి కడుపులోకి అవి ఎలా చేరాయో తెలియదని ఆయన కుటుంబ సభ్యులూ అంటున్నారన్నారు. ఈ ఇనుప వస్తువులు పేగుల్లోకి వెళ్లి ఉంటే ప్రాణానికి ముప్పు ఉండేదని అనిల్ షైనీ చెప్పారు. ఈ ఘటనతో ఇది కడుపా లేక ఇనుప కొట్టా? అని అందరు ఆశ్చర్యపోయారు.

- Advertisement -