రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా బొంతు శ్రీదేవి గారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు యశోద హాస్పిటల్, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ప్రమోద్ కుమార్.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది . ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది . హైదరాబాద్ నగరం పూర్తిగా కాంట్రిట్ జంగల్ అయింది . ఇలాంటి మహానగరం లో పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరి మీద ఎంతో బాధ్యత ఉంది , సంతోష్ కుమార్ గారు ఎంతో బాధ్యతగా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలి అని ప్రతి ఒక్కరి చేత కనీసం మూడు మొక్కలు నాటాలి అని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని చేపట్టారు.
ఇందులో అందరు బాగస్వామ్యులై , కార్యక్రమం విజయవంతం చేయాలనీ కోరారు .దీనివల్ల వాతావరణం లో వచ్చే మార్పులను సమతుల్యం చేస్తాయి . ఇంకా మన ఇంటిపరిసరాలను , ఇంటిపైన వీలుంతంగా చిన్న చిన్న మొక్కలు పెంచి ఎండా వేడిమి తగ్గించాలి .పర్యావరణ కాలుష్యం తో ఉన్న గాలిని పీల్చడం వల్ల హుద్రోగ సమస్యలు పెరుగుతాయని , మొక్కలు నాటడం వల్ల మంచి గాలి దొరుకుతుంది , హుద్రోగసమస్యలు తగ్గించవచ్చు అని కోరారు . అయన మరో ముగ్గురికి సాయిచంద్ సినిమా యాక్టర్ , వై రామారావు హైకోర్టు న్యాయవాది , సత్యప్రసాద్ ప్రముఖ రేడియాలజీ చీఫ్ అపోలో హాస్పిటల్ గార్లకు ఛాలెంజ్ విసిరారు.