ప్రభాస్…రాధే శ్యామ్‌ ఫస్ట్ లుక్

211
prabhas radhe shyam
- Advertisement -

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలుండగా కాసేపటి క్రితం సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

ఇక సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రకరకాల వార్తలు చక్కర్లు కొట్టగా ఎవరూ ఉహించని విధంగా రాధే శ్యామ్ అనే టైటిల్‌ని ఖరారుచేసింది. ఈ పోస్టర్ తోనే సినిమా పై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసాడు దర్శకుడు.

ప్రభాస్, పూజా ఇద్దరు కలిసి ఉండే ఈ పోస్టర్‌లో పూజా డ్రెస్ నుండి ఓ సముద్రాన్ని తలపించే విధంగా పోస్టర్ కనిపిస్తుంది. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. తెలుగు తమిళ్, హిందీ , మలయాళ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -