- Advertisement -
హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సమాచార భవన్‌లో కొవిడ్ – 19పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. మాధవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా భయంకరమైన వ్యాధి కాదు. కానీ వ్యాప్తి ఎక్కువగా జరిగే వ్యాధి కావడంతో జాగ్రత్తలు పాటించాలి. బయటికి వెళ్లినా, ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ వేసుకోవడం మంచిదన్నారు.
ఇక ఎవరికైనా జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు, ఇతర జబ్బులు ఉన్నవారికి త్వరగా ఈ వైరస్ సోకుతుంది. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయడం.. కరోనా నివారణకు తోడ్పడింది. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనాను అరికట్టొచ్చన్నారు డాక్టర్ మాధవ్.
- Advertisement -