గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హారితసేన లో భాగంగా Orgin Boday Mind Soul clinic ప్రారంభిస్తున్న సందర్బంగా జూబ్లీహిల్స్ లో మొక్కను నాటారు Dr జ్యోష్ణ . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభిచిన ఇంతటి గొప్ప కార్యక్రమం లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. మొక్కను నాటి మా క్లినిక్ ప్రారభించడం ఒక శుభ పరిణామం అన్నారు.
వేప మొక్కను నాటడం జరిగింది అని వేప మొక్కలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయాని వేప మొక్కలు పెంచడం వల్ల అనేక రకమయిన లాభాలు ఉంటాయాని అన్నారు.ఆధునికరణ పేరుతో చెట్లను నరుకుతున్నారు కానీ పాత రోజుల్లో ఉన్న వేప, చింత, రావి చెట్లు పెట్టడం చాలా అవసరం అన్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని అదేవిదంగా నాకు ఈ అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా భాస్కర్,ప్రసాద్, RJ సునీత గారిని మొక్కలు నాటాలని కోరారు.
Also Read:వెల్లుల్లి.. ఎన్నో ప్రయోజనాలు!

