మొక్కలు నాటిన డాక్టర్‌ డాస్వీతి అనూప్…

123
doctor

హరిత తెలంగాణ సాధనకోసం, పర్యావరణ పరిరక్షణ పై ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కొరుట్ల మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య గారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి తమ ఇంటి ఆవరణలో మొక్కలను నాటిన కొరుట్ల ప్రముఖ వైద్యురాలు డాస్వీతి అనూప్.

శ్రీమతి డా స్వీతి అనూప్ గారు మాట్లాడుతూ హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,తెలంగాణ కు హరితహారం తో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప కార్యక్రమం చేపట్టారన్నారు. అలాగే హరితహారంలో నాటిన ప్రతి మొక్క కాపాడే బాధ్యత మనమే తీసుకోవాలని కోరారు..

అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సతీమణి సరోజ మరియు కొరుట్ల ఎస్. ఐ రాజా ప్రమీల, డా అరుణ ప్రభాకర్ గార్లకు తలా మూడు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరినట్లు డా స్వీతి అనూప్ గారు తెలిపారు..