ధనుష్- నాగార్జున మల్టీస్టారర్

19
- Advertisement -

పవర్‌హౌస్ ఆఫ్ టాలెంట్స్- నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున అక్కినేని క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ #DNS కోసం చేతులు కలిపారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు నిర్మిస్తునారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

#DNS చిత్రం (ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల ) ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. పూజా కార్యక్రమానికి సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్, జాన్వీ నారంగ్ తదితరులు హాజరయ్యారు. ధనుష్‌తో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో రెగ్యులర్ షూటింగ్ నిన్న ప్రారంభమైంది.

ధనుష్, నాగార్జునలు సంక్రాంతికి వచ్చిన తమ చిత్రాలు కెప్టెన్ మిల్లర్ (తమిళం) నా సామి రేంజ్‌తో బ్లాక్‌బస్టర్‌లను అందించడంతో ఈ ఎపిక్ మల్టీ-స్టారర్ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న ఎక్సయిమెంట్ రెట్టింపు అయ్యింది. ఇద్దరు స్టార్స్ ని బిగ్ స్క్రీన్స్ పై కలసి చూడటాని అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.

రెండు బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ ఫిదా, లవ్ స్టోరీని రూపొందించిన తర్వాత శేఖర్ కమ్ముల బిగ్ కాన్వాస్‌పై యూనిక్ కథతో ఈ మల్టీస్టారర్ ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌ పరంగానూ సినిమా సాలిడ్‌గా ఉండబోతోంది.టెక్నికల్ టీం విషయానికి వస్తే, నికేత్ బొమ్మి డీవోపీగా పని చేస్తుండగా, రామకృష్ణ సబ్బని, మోనికా నిగోత్రే ప్రొడక్షన్ డిజైన్‌ నిర్వహిస్తున్నారు.మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

Also Read:క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్ని లాభాలో!

- Advertisement -