ఓ పెద్ద తప్పును కాంగ్రెస్ సరి చేస్తోంది అన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. కాంగ్రెస్ మహా ధర్నాలో మాట్లాడిన కనిమొళి… మన హక్కులను మనం కాపాడుకోవాలి అన్నారు. పెరియార్ స్ఫూర్తితో రిజర్వేషన్ల కోసం పోరాడం అన్నారు.
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు సాధించుకున్నాం…. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మా హక్కు.. సాధించుకుని తీరుతాం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేంద్రానికి కనువిప్పు కలిగేందుకే ఢిల్లీలో మహా ధర్నా చేపట్టాం… అసెంబ్లీలో మద్దతు తెలిపిన రాష్ట్ర బీజేపీ నేతలు.. ఢిల్లీలో మాత్రం యూ టర్న్ తీసుకున్నారు.. ఎవరి ఒత్తిడితో యూ టర్న్ తీసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలి అన్నారు.
Also Read:Chiru:రాజకీయాలకు దూరం
బీసీ రిజర్వేషన్ల పోరాటం మరో తెలంగాణ ఉద్యమంగా మారుతుంది… బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దు అన్నారు. 42 శాతం రిజర్వేషన్ తో ఉద్యోగస్థులు, విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది…. రాష్ట్రంలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ ఢిల్లీలో మాత్రం మోకాలు అడ్డుతోంది అన్నారు.

