రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు..

30
srinivas

రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు డీహెచ్‌వో శ్రీనివాస్‌ రావు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిందన్నారు.

కెన్యా జాతీయురాలి వ‌య‌సు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశ‌స్థుడి వ‌య‌సు 23 ఏండ్లు అని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్ద‌రి శాంపిల్స్ సేక‌రించి జీనోమ్ సీక్వెన్స్‌కు పంపామ‌ని కెన్యా జాతీయురాలిని టిమ్స్‌కు త‌ర‌లించాం. సోమాలియా దేశ‌స్థుడిని ట్రేస్ చేస్తున్నాం అని చెప్పారు.

వీరి కుటుంబ స‌భ్యుల‌కు కూడా ఆర్టీపీసీఆర్ ప‌రీక్షలు నిర్వ‌హించామ‌న్నారు. ఇక మూడో వ్య‌క్తికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డ్డాడు. అత‌ని వ‌య‌సు ఏడేండ్లు మాత్ర‌మే. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన వెంట‌నే కోల్‌క‌తాకు వెళ్లాడ‌ని, రాష్ట్రంలోకి ప్ర‌వేశించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.