డెల్టా వేరియంట్ ప్రమాదకరమనే ఆధారాలు లేవు..!

247
dmho
- Advertisement -

డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని తెలిపారు వైద్యారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు.డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ….నెల రోజుల్లో ప్రభుత్వ దవాఖానల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు.

డెల్టా ప్లస్‌ వేరియంట్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నామని…రాష్ట్రంలో ఇప్పటివరకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదవలేదని వెల్లడించారు. ఇప్పటివరకు 1.14 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని…ఇందులో 16.39 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చామని, 81.42 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్‌ పూర్తయిందని వెల్లడించారు.

కరోనా పాజిటివిటీ రేటు 0.78 శాతానికి తగ్గిందని…. ప్రైవేటు దవాఖానల్లో చికిత్సలు, గరిష్ఠ ధరలపై జీవో ఇచ్చామన్నారు. జీవో ఉల్లంఘిస్తే ప్రైవేటు వైద్య కేంద్రాలపై చర్యలు తీసుకుంటాని వివరించారు. వి విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 11 కేంద్రాల్లో టీకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు.

- Advertisement -