అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ!

9
- Advertisement -

బెంగళూరుతో పాటు అంతర్జాతీయ నగరాలతో కూడా హైదరాబాద్ పోటీ పడుతుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. భవిష్యత్ తరాలకు అవసరమైన దిశలో ఆలోచిస్తూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.

రాష్ట్రంలో ప్రజాపాలనకు ప్రాధాన్యమిస్తూ, రెండు సంవత్సరాల కాలంలో ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా పని చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, దక్షిణ భారత సమగ్ర పురోగతికి కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. నగరాల మధ్య పోటీ ఆరోగ్యకరమైనదని, ఇది రెండు రాష్ట్రాలకు కూడా లాభదాయకం అవుతుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.

అదే సమయంలో, మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణను పెట్టుబడుల కోసం దేశంలోనే ఉత్తమ గమ్యస్థానంగా అభివర్ణించారు. హైదరాబాద్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర ఆర్థిక పురోగతిలో కీలక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని, ముఖ్యంగా 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధనలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, పరిశ్రమల రంగాల్లో తెలంగాణ అద్భుత పురోగతి సాధిస్తోందని, ఇన్నోవేషన్‌లో దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని మంత్రి వివరించారు. స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు.

Also Read:గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రజాధనం వృథా!

- Advertisement -