కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయనుండగా సీఎం అభ్యర్థిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ప్రధానంగా సిద్దరామయ్య, డీకే శివ కుమార్ మధ్య పోటీ నెలకొనగా ఎవరికి వారే సీఎం పదవిపై ధీమాతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీకి బయలుదేరారు డీకే శివకుమార్. తమది ఐక్య కూటమి అని, మా సంఖ్య 135 అని, కూటమిని విభజించాలన్న ఆలోచన తనకు లేదని డీకే అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను ఆదరించినా, ఆదరించకపోయినా.. తాను బాధ్యత కలిగిన వ్యక్తి అని అన్నారు. ఎవర్ని వెన్నుపోటు పొడవడను అని, ఎవర్నీ బ్లాక్‌మెయిల్ చేయడం లేదని డీకే తెలిపారు.
Also Read:బరువు పెరగాలంటే.. ఇవి పాటించండి
అయితే కడుపు ఇన్‌ఫెక్షన్ వల్ల నిన్న తాను బెంగుళూరులోనే ఉండి పోవాల్సి వచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే తెలిపారు. ఇప్పటికే హస్తినలో మకాం వేశారు సిద్దరామయ్య. వీరిద్దరి ఢిల్లీ పర్యటన తర్వాత కర్ణాటక సీఎం ఎవరనేది తెలియనుంది.
Also Read:మాంసాహారం తిన్న తరువాత ఇలా అస్సలు చేయకండి!