ఆశీంచిన ఫలితాలు రాలేదు:డీకే

36
- Advertisement -

లోక్ సభ ఎన్నికల్లో తమకు ఆశీంచిన ఫలితాలు రాలేదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.గురువారం పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించేందుకు సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడిన డీకే…కర్ణాటలో ఆశీంచిన సీట్లు రాలేదన్నారు. 14 నుండి 15 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని అంచనా వేశామని కానీ ఉహించిన విధంగా ఫలితాలు రాలేదన్నారు.

ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో విశ్లేషించుకుని, వాటిని సరిదిద్దుకుని భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ముందుకెళతామని చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌ లను నిలువరించేందుకు ఏం చేయాలనేదానిపై కసరత్తు సాగిస్తున్నామన్నారు.

కర్ణాటకలోని 28 లోక్‌సభ స్ధానాలకు గాను ఎన్డీయే కూటమి 19 స్ధానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్‌ కేవలం 9 స్ధానాలకు పరిమితమైంది.

Also Read:KTR:ఈ మహా నగరానికి ఏమైంది..? 

- Advertisement -