కర్ణాటక సీఎం మార్పుపై కాంగ్రెస్ మాజీ సీఎం వీరప్ప మొయిలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే శివ కుమార్ సీఎం అవ్వడం 100% ఖాయం.. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని తేల్చిచెప్పారు. సీఎం పోస్ట్ అనేది కష్టపడితే వచ్చేది.. దానికి డీకే శివ కుమార్ అర్హుడు అన్నారు.
దీనిపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారని, కాకపోతే అందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు.డీకే తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిక్కెట్ అందుకోవడం వెనుక తన పాత్ర ఉందని గుర్తుచేశారు. ఇపుడాయన రాష్ట్ర రాజకీయాల్లో విజయవంతమైన నేతగా ఎదిగారని చెప్పారు.
ఎన్ని రకాలైన ఊహాగానాలు వినిపించినా ఆయన మాత్ర సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. కర్నాటక సహా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి డీకే ఎంతగానో కృషి చేశారని చెప్పారు.
మరోవైపు డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని డీకే శివకుమార్ ఖండించారు.
Also Read:Oscars 2025: ఆస్కార్ విజేతలు వీరే

