సీఎం కుర్చీ కోసం తీవ్రపోరాటం:డీకే

5
- Advertisement -

సీఎం కుర్చీ కోసం మేము తీవ్ర పోరాటాలు చేస్తున్నాం అని తెలిపారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఓ సమావేశంలో మాట్లాడిన డీకే.. కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదు.. కానీ ఒకసారి కుర్చీ దొరికితే దాన్ని వదలొద్దు అని తెలిపారు.

ఇక సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీకి వెళ్లడంతో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం సిద్దూ స్పందించిన సంగతి తెలిసిందే.

Also Read:ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి

డీకే శివ కుమార్‌కు సీఎం అవ్వాలని ఆశ ఉంది కానీ, 2028 ఎన్నికల వరకు నేనే సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. డీకే తాను ఇద్దరం స్నేహంగానే ఉన్నామని చెప్పారు. ఈ క్రమంలో డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

- Advertisement -