టి కాంగ్రెస్ లో డీకే శివకుమార్ క్రియాశీలకంగా మారనున్నారా ? పార్టీ వ్యవహారాలన్నీ డీకేకు అప్పగించే పనిలో హైకమాండ్ ఉందా ? తెలంగాణ విషయంలో కూడా అధిష్టానం డీకే నే నమ్ముకుందా ? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానాలు కలుగక మానవు. ఇటీవల టి కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్ తో తరచూ భేటీ అవుతున్నారు. దీనికి గల కారణాలు ఏంటి అనే దానిపై రకరకాల అభిప్రాయాలూ తెరపైకి వస్తున్నాయి. కర్నాటక ఎన్నికల విజయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. అసలు గెలుపే కష్టమని భావించిన తరుణంలో కనీ విని ఎరుగని రీతిలో పార్టీ విజయం సాధించిందంటే దానికి కారణం డీకే నాయకత్వమనే చెప్పక తప్పదు.
అందువల్ల తెలంగాణ భారం కూడా డీకే పైనే మొపేందుకు హస్తం హైకమాండ్ సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టి కాంగ్రెస్ లో వర్గ పోరు గతకొన్నాళ్లుగా వేదిస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంపై సీనియర్స్ అంతా మూకుమ్మడిగా వ్యతిరేకత చూపుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ రగడ కొంత సద్దుమణిగినప్పటికి నివురు గప్పిన నిప్పుల ఉందనేది అందరికీ తెలిసిన విషయం. ఎన్నికల ముందు మళ్ళీ ఈ వర్గ పోరు తెరపైకి వస్తే మొదటికె మోసం వచ్చే అవకాశం లేకపోలేదు.
Also Read: BRS:బీజేపీకి కౌంటర్ ఇచ్చిన కవిత
అసలే కర్నాటకలో దక్కిన విజయాన్ని తెలంగాణలో కూడా కొనసాగించాలనే కాన్ఫిడెంట్ తో హస్తం పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో అన్నీ విధాలుగా పక్కా వ్యూహరచనతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది… అందుకే రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పటికి పార్టీ వ్యవహారాలకు సంబంధించి అన్నీ అంశాలు డీకే నే చూసుకునే విధంగా హస్తం హైకమాండ్ ప్లాన్ చేస్తోందట. డీకే పై టి కాంగ్రెస్ నేతలందరు సానుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవహారాలు డీకే చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదని అధిష్టానం ఆలోచిస్తుందట. మరి టి కాంగ్రెస్ లో డీకే పాలిటిక్స్ హస్తం పార్టీకి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.
Also Read: పత్తి విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠినచర్యలు..

