డీకే అరుణ వర్సెస్‌ సంపత్‌ కుమార్

300
sampath kumar vs dk aruna
- Advertisement -

గాంధీభవన్‌ సాక్షిగా మరోసారి కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై గాంధీభవన్లో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్ మధ్య మాటలయుద్ధానికి దారితీసింది.

మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నాగ‌ర్ క‌ర్నూల్ పార్లమెంట్‌ అభ్యర్ధులపై చ‌ర్చ డీకే అరుణ,సంతప్‌ పరుష పదజాలంతో దూషించుకున్నారు. నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ స్థానానికి స‌తీష్ మాదిగ‌ పేరును డీకే అరుణ ప్రతిపాదించగా సంపత్‌, వంశీచంద్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో హోదా లేని వారిని ఎలా ప్రతిపాదిస్తారంటూ డీకే అరుణను ప్రశ్నించారు సంపత్‌. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన‌ వారు ఏఐసీసీ సెక్రెట‌రీ కాలేదా అంటూ సంపత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ. దీంతో డీకే అరుణ, సంపత్‌ల మధ్య డైలాగ్‌ వార్‌ నడిచింది.

ఇక మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుండి జైపాల్ రెడ్డిని పోటీ చేయించాలని డీకే అరుణ సూచించగా ఆయన ఆసక్తిచూపించడం లేదని ఉత్తమ్ చెప్పారు. జైపాల్ రెడ్డి లేకుంటే ఎలా అని డీకే అరుణ అనడం చిన్నారెడ్డి జోక్యంతో సమావేశం మరోసారి హిటెక్కింది.

ఇక నల్గొండ పార్లమెంట్ సీటు విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుండి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్తమ్ ప‌ద్మావ‌తి రెడ్డి, ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, ర‌ఘువీర్ రెడ్డి, స‌ర్వోత్తమ్‌ రెడ్డి ఇలా అందరు కీలకనేతలు సీటు ఆశీస్తున్నారు. తామంటే తాము పోటీచేయడం ఖాయమని సమావేశంలో నాయకులు తేల్చిచెప్పడంతో సీటు ఎవరికి దక్కినా మిగితావారి నుండి అసంతృప్తి ఎదుర్కొవడం ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

ఒక్కో స్థానం నుంచి 8 నుంచి 10 పేర్లను డీసీసీ అధ్యక్షులు పంపడంతో సీనియారిటీ, సామాజిక సమీకరణలు, పార్టీ పట్ల విధేయత లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో స్థానానికి నాలుగు, మరికొన్ని స్థానాలకు ఐదు పేర్లను ఖరారు చేశారు పార్టీ నేతలు. త్వరలో తుదిజాబితా వెలువడనున్న నేపథ్యంలో మరోసారి గాంధీభవన్‌కు తాళం వేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -