‘డీజే టిల్లు’ మూవీ రివ్యూ..

710
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. శనివారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు హీరోగా.. రచయితగా సిద్ధు కీలక పాత్ర పోషించాడు. ట్రైలర్‌తో యువతను విపరీతంగా ఆకర్షించిన ఈ చిత్రం.. థియేటర్లలో ఏమేర ఆకట్టుకుందో చూద్దాం.

కథ: తల్లిదండ్రులు పెట్టిన బాలగంగాధర్ తిలక్ అనే పేరును టిల్లుగా మార్చుకుని చిన్న చిన్న ఫంక్షన్లలో డీజే కొడుతూ.. బయటికి పెద్ద బిల్డప్ ఇస్తూ తన స్టయిల్లో జీబితాన్ని సాగిస్తుంటాడు ‘డీజే టిల్లు’. ఇలా సాఫీగా సాగిపోతున్న అతడి జీవితంలోకి అనుకోకుండా రాధిక (నేహా శెట్టి) వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ రోహిత్ (కిరీటి) నుంచి విడిపోతున్న దశలో టిల్లు పరిచయం కావడంతో అతడికి చేరువ అవుతుంది రాధిక. ఈ సంగతి తెలిసి రోహిత్ ఆమెతో గొడవ పడతాడు. ఈ క్రమంలో అనుకోని విధంగా రోహిత్ చనిపోతాడు. ఈ కేసులో రాధికతో పాటు టిల్లు కూడా చిక్కుకుంటాడు. దీని వల్ల తలెత్తిన పరిణామాలేంటి.. ఈ హత్యతో వీళ్లిద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్‌: హీరోగా సిద్ధూ ఇంతకు ముందు చేసిన పాత్రలు వేరు. టిల్లు పాత్ర వేరు. ఇందులో అతని సరదాతనం, డైలాగ్‌లు, మేనరిజం ఆకట్టుకున్నాయి. కథానాయిక నేహాశెట్టి పాత్ర అసంపూర్ణంగా ఉన్నా.. గ్లామర్‌తో ఆకట్టుకుంది. కీలక పాత్రలు పోషించిన బ్రహ్మాజీ, నర్రా శ్రీను పరిధి మేరకు పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు విమల్‌ కృష్ణ హీరో క్యారెక్టరైజేషన్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టాడు. అది బాగా వర్కవుట్‌ అయింది.

మైనస్ పాయింట్స్‌: ఫస్టాఫ్‌లో కనిపించిన జోష్‌ ఆ తర్వాత మిస్‌ అయింది మెమరీ లాస్‌ అంటూ ఆస్పత్రిలో సాగే సన్నివేశాలు.. కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. కోర్టు రూమ్‌ సీన్‌ కూడా ప్రొఫెషనల్‌గా లేదు. నర్రా శ్రీను, బ్రహ్మాజీ పాత్రల ఎంట్రీతో వేగంగా సాగిన ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌కి వచ్చేసరికి నెమ్మదించింది.

సాంకేతిక విభాగం: రామ్‌ మిరియాల, శ్రీచరణ్‌ పాకాల పాటలు అలరించాయి. ముఖ్యంగా తమన్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఎసెట్‌. కెమెరా పనితనం బావుంది. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ మీద దృష్టి పెట్టి ఉండే ల్యాగ్‌ అనే భావన కలిగేది కాదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు: చివరగా కథ కాస్త నిరాశపరిచినా.. డీజే టిల్లు మాత్రం ఆకట్టుకున్నాడు..

విడుదల తేదీ: 12/02/2022
రేటింగ్:2/5
నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ,నేహా శెట్టి.
సంగీతం: శ్రీ చరణ్ పాకాల-రామ్ మిర్యాల
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకత్వం: విమల్ కృష్ణ

- Advertisement -