లాభాల బాటలో డీజే టిల్లు..

128
dj tillu
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. శనివారం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరోజే లాభాల్లోకి ప్రవేశించగా అఖండ, పుష్ప సినిమాల తర్వాత చిన్న సినిమాకు ఇంతమంచి స్పందన రావడం విశేషం.

దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ప్రోత్సాహం,తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు మరింత ప్లస్ అయింది. నైజాం ఏరియాలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. రేసులో మరే పెద్ద సినిమా లేకపోవడంతో డీజే టిల్లుకు కలిసివచ్చింది.

చాలాకాలం తర్వాత ఒక చిన్న సినిమా నుండి హిట్ టాక్ రావడంతో సినీ ఇండస్ట్రీకి మరింత కలిసిరానుంది.

- Advertisement -