హైదరాబాద్‌లో డీజే పై నిషేధం..

7
- Advertisement -

హైదరాబాదులో డీజే పై నిషేధం విధించారు. మతపరమైన ర్యాలీలలో ఎలాంటి డీజేను ఉపయోగించకూడదు అని పోలీసు అధికారులు వెల్లడించారు. సౌండ్ సిస్టంలను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తాము…సౌండ్ సిస్టం పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరి అన్నారు.

నాలుగు జోన్లలో సౌండ్ సిస్టంలో పెట్టడానికి డెసిబిల్స్ ను నిర్దేశించిన పోలీసులు…జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబెల్స్ కి మించి సౌండ్ సిస్టం లో వాడరాదు అని చెప్పారు. రాత్రి వేళలో 45 డేసి బస్సుకి నుంచి సౌండ్ సిస్టంలో వాడరాదు…మతపరమైన ర్యాలీలలో బాణాసంచా కాల్చడం పూర్తిగా నిషేధం అని వెల్లడించారు పోలీసులు.

నిబంధన లు ఉల్లంఘిస్తే ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని..పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రతిరోజు 5000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు.

Also Read:Harishrao: కేటీఆర్‌పై దాడిని ఖండించిన హరీశ్‌

- Advertisement -