అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దువ్వాడ జగన్నాథమ్’ షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే డీజే హిందీ రైట్స్ 7 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు భిన్న పార్శాలున్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటున్నది. ఈ సినిమా హిందీ హక్కులు మునుపెన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఏడు కోట్లకు అమ్ముడుపోయాయని చెబుతున్నారు. కేవలం తెలుగు భాషలో రూపొందిన సినిమా హిందీ అనువాద హక్కుల్ని ఇంత భారీ మొత్తానికి విక్రయించడం ఇదే ప్రథమమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా మరో లుక్‌ని విడుదల చేసింది. కూడా వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఈ మూవీ నుండి తాజాగా మరో లుక్‌ను రిలీజ్ చేశారు.ఫస్ట్ టైం బ్రాహ్మణ్ వేషధారణలో ఆకట్టుకున్న బన్నీ ఈ సారి పూర్తిస్ధాయి మాడ్రన్ లుక్‌లో అదరగొట్టాడు. ఆడియో కమింగ్ సూన్ అంటూ అభిమానుల్లో ఆసక్తి రేపారు. బన్నీ, పూజా హెడ్డా సాంగ్ కు సంబంధించిన లుక్ ఇది. ఇద్దరూ కళ్లు మూసుకున్నారు కానీ.. అభిమానుల కళ్లల్లో ఆనందం నింపారు.
ఈ సినిమా తర్వాత బన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం ‘ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. టైటిల్ ను బట్టే ఇది దేశభక్తితో ముడిపడిన సినిమా అనే విషయం అర్థమైపోతోంది.