‘చౌకీదార్’గా దియా ఫేమ్ పృథ్వీ

3
- Advertisement -

దియా ఫేమ్ పృథ్వీ అంబర్, రథావర దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న న్యూ మూవీకి ‘చౌకీదార్’ అనే టైటిల్ పెట్టారు. పృథ్వీ ఇప్పుడు చౌకీదార్‌గా నటిస్తున్నారు. చౌకీదార్ అనే టైటిల్‌ను ఎర్ర అక్షరాలతో యూనిట్ రిలీజ్ చేసింది. రోరింగ్ స్టార్ శ్రీమురళి, చంద్రశేఖర్ బండియప్ప 6వ అటెంప్ట్ కి సపోర్ట్ చేస్తూ, టీమ్ మొత్తానికి అభినందనలు తెలుపుతూ “చౌకీదార్” టైటిల్‌ను అనౌన్స్ చేశారు. “చౌకీదార్” మల్టీ లింగ్వల్ మూవీ. కన్నడతో పాటు పలు ఇతర భాషల్లో రూపొందుతోంది.

“చౌకీదార్’అనే టైటిల్‌ను బట్టి ఇది మాస్ మూవీ అని అనుకోకండి. నిజానికి ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చంద్రశేఖర్ బండియప్ప తన ప్రతి సినిమాలోనూ సరికొత్త కథతో అలరిస్తారు: ‘అనే పాటకి’లో కామెడీ, ‘రథావర’లో కల్ట్ థీమ్స్, ‘తారకాసుర’లో యూనిక్ కథాంశం, ‘రెడ్ కాలర్’లో క్రైమ్ థ్రిల్లర్, ‘కౌస్తి’లో కోస్టల్ డ్రామా.

పృథ్వీ, చంద్రశేఖర్ బండియప్ప సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విద్యా శేఖర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్లహళ్లి చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా, వి.నాగేంద్రప్రసాద్, ప్రమోద్ మరవంటే లిరిక్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక సిబ్బందిని మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు

‘అనే పాటకి’తో శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టిన చంద్రశేఖర్ బండియప్ప ఆ తర్వాత ‘రథావర’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ విజయాల తరువాత, బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. కన్నడ కిషోర్ నటించిన యాక్షన్ ఫిల్మ్ “రెడ్ కాలర్”కి దర్శకత్వం వహించాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత, గురుదత్ గనిగ దర్శకత్వం వహించిన “కరావళి”కి కథ రాశారు.

Also Read:రెడ్ బుక్…టెన్షన్!

- Advertisement -