దీపావళి….తీసుకోవాల్సిన జాగ్రత్తలు

654
happy diwali
- Advertisement -

భారతీయ పండుగల్లో దీపావళిది ప్రత్యేక స్థానం. దివాళి పేరు చెప్పగానే ముందుగా గుర్చొచ్చేది దీపాలే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు పండగ సంబురమే కనిపిస్తోంది. పటాకుల మోతలు లేకుండా దీపావళి పూర్తి కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ బాంబులు కాల్చడానికి సిద్ధంగా ఉన్నారు. క్రాకర్స్ షాపింగ్ లో జనమంతా బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రంలో బాణసంచా అమ్మకాలు పెద్దెత్తున సాగుతున్నాయి. షాపులన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి.

ఇక దీపావళి జ్ఞాపకాలు ఆనందదాయకంగానే ఉండాలి. దేహం మీద గాయాలను చూసుకుని ఫలానా ఏడాది దీపావళి టపాకాయలు కాలుస్తున్నప్పుడు అంటూ… చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకునే పరిస్థితి రాకూడదు. అందుకే బాణసంచాను, మద్యాన్ని పక్కపక్కన ఉంచరాదు. నిండు ప్యాకెట్లనే కొనాలి, విడిగా ఉన్నవాటిని తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి లోపల బాణసంచాను కాల్చవద్దు.

కొన్ని జాగ్రత్తలు..
– నాణ్యమైన, గుర్తింపుగల కంపెనీలకు చెందిన పటాకులను మాత్రమే కొనుగోలు చేయాలి
– పిల్లలను ఒంటరిగా పటాకులు కాల్చేందుకు అనుమతివ్వరాదు. పెద్దవారు తప్పనిసరిగా వారి వెంట ఉండాలి.
– మైదానాలు, ఖాళీ స్థలాల్లో మాత్రమే పటాకులు కాల్చాలి
– పెట్రోల్‌బంక్‌లు, గ్యాస్ డిపోలు, గుడిసెలు, తాట్‌పత్రిలతో కట్టిన దుకాణాలు, మండే స్వభావం గల దుకాణాలు, ఇతర కేంద్రాలకు దగ్గరలో పటాకులు కాల్చవద్దు..
– చిచ్చుబుడ్లు(అనార్లు), రాకెట్లు, కాకర్‌పుల్లలు వెలిగించే సమయంలో వాటిని తలకు దూరంగా పెట్టి వెలిగించాలి. అవి కాలిపోయిన వెంటనే వాటికి దగ్గరగా ముఖం పెట్టి చూడడం చాలా ప్రమాదకరం.
– పొడవైన కాకరపుల్లలతో మాత్రమే పటాకులను వెలిగించడంగాని, పేల్చడంగాని చేయాలి.
– ముందుజాగ్రత్తగా దగ్గరలో కనీసం రెండు బక్కెట్ల నీటిని అందుబాటులో పెట్టుకోవాలి.
– బాణసంచాను మండిపోయే/సులభంగా అంటుకునే వస్తువుల నుంచి దూరంగా పెట్టండి.
– టపాసులు కాల్చడానికి తప్పనిసరిగా ఒక పొడవాటి కొవ్వొత్తిని ఉపయోగించాలి. శరీరానికి, టపాకాయ దూరాన్ని పెంచడానికి మోచేతిని బాగా ముందుకు చాచాలి. దీనివల్ల కాలే గాయాల నుంచి తప్పించుకోవచ్చు

ప్రమాదాలు జరిగినప్పుడు..
– చిన్నచిన్న కాలిన గాయాలు జరిగిన వెంటనే గాయంపై నీరు పోయాలి.
– ఒంటికి మంటలు అంటుకున్న సందర్భంలో శుభ్రమైన కాటన్ బెడ్‌షీట్‌గాని, దుప్పటితో బాధితులకు అంటుకున్న మంటలను ఆర్పివేసి వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.
– పటాకులను వెలిగించే సమయంలోగాని, వెలిగించిన తరువాతగాని అవి పేలి, ముఖానికి గాయాలైతే వెంటనే దగ్గరలో ఉన్న కంటి ఆసుపత్రికి వెళ్లాలి.. ఎందుకంటే ముఖానికి కాలిన గాయాలైనప్పుడు ముఖ్యంగా కళ్లపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Also Read:కిరణ్‌కు పెద్ద అభిమానిని: నాగచైతన్య

- Advertisement -