- Advertisement -
తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పెంచింది సర్కార్. నూతన మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి దరఖాస్తుల దాఖలు గడువును పొడిగించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 23 వరకు గడువు పెంచుతున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలిపారు. బీసీ, బ్యాంకుల బంద్‌లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీంతో ఈ నెల 23న జరగాల్సిన మద్యం షాపుల డ్రా వాయిదా పడింది. శనివారం నాటికి 85,363 దరఖాస్తులు రాగా.. నిన్న ఒక్క రోజే 38,754 దరఖాస్తుల వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Also Read:జూబ్లీహిల్స్ బై పోరు..నిరుద్యోగుల నామినేషన్
- Advertisement -

