సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

432
sccl
- Advertisement -

సింగరేణి కార్మికులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. గతంలో ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా ఇచ్చే బోనస్‌లో భాగంగా ఈ ఏడాది ఒక్కొ కార్మికుడిగి రూ.64,700 బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

గతేడాది రూ.60,500/- బోనస్ ఇవ్వగా ఈసారి మరింత ఎక్కువగా బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈనెల 25 వ తేదీన ప్రతిభ ఆధారిత ప్రయోజనం(పీఎల్‌ఆర్‌) ద్వారా కార్మికులకు ఈ బోనస్ అందబోతున్నది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న 48 వేల మంది కార్మికులకు లబ్ది చేకూరనుంది.

సింగరేణి సంస్థ బోనస్ ను ప్రకటించడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. తమ కుటుంబాల్లో సింగరేణి దీపావళి వెలుగును నింపిందని… గతేడాది కంటే మరింత బోనస్ ఇవ్వడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.

- Advertisement -