హిందువుల పండుగలలో ప్రత్యేకమైనది దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునేదే దీపావళి. ఇళ్లంతా దీపాలు వెలిగించి చీకటిని తరుముతూ వెలుగును స్వాగతిస్తూ ఆనందోత్సాహంతో జరుపుకొనే పండుగ. దీప అంటే దీపం, ఆవళి అంటే వరుస కాబట్టి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. చిన్నా….పెద్ద.. పేదా, ధనిక అనే తారతమ్యాలు లేకుండా ఆనందంగా జరుపుకునే పండగ.
పురాణాల ప్రకారం భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. తనకు లభించిన వరంతో ముల్లోకాలను నరకాసురుడు పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీ మహావిష్ణువుకి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.
దీపావళి పండుగకు నోములు చేస్తుంటారు.కొన్ని ప్రాంతాలలో ఐదు రోజులు మరికొన్ని ప్రాంతాలలో మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి పండుగను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. గురు హోరలో హారతులు తీసుకోవడానికి ఎంతో అనువైన సమయం. ఈ హారతులు ఆ ఇంటి ఆడపడుచులు అన్నదమ్ములకు లేక కూతుళ్ళూ తండ్రికి హారతులు ఇవ్వాలి ఎందుకంటే సంప్రదాయాల్లో ఆడపడుచులు సాక్షాత్తు లక్ష్మీదేవి తో సమానంగా చూస్తారు.
Also Read:కొత్త అనుభూతిని ఇచ్చే.. ‘లక్కీ భాస్కర్’