CMKCR:జూన్ 30న పోడు పట్టాల పంపిణీ

80
- Advertisement -

సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని గిరిజనులకు గుడ్‌న్యూస్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమంలో శ్రీకారం చుట్టనున్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాలు, నియోజకవర్గాల్లో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.

నిజానికి ఈ నెల 24 నుంచే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రకటించినప్పటికీ కొన్ని అనివార్యకారణాలతో ఈనెల 30వ తేదీన వాయిదా వేసింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అదే సందర్భంగా 29వ తేదీన బక్రీద్‌ పండుగ ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని జూన్‌ 30కి వాయిదా వేయాలని నిర్ణయించింది. అదే విధంగా ఆసిఫాబాద్‌ జిల్లాలో కలెక్టరేట్, జిల్లా పోలీసుల ప్రధాన కార్యాలయాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.

Also Read: విపక్షాలకు బి‌ఆర్‌ఎస్ దూరం.. కారణం అదే !

- Advertisement -