ఆప్‌కు ఈసీ షాక్‌..

240
Disqualify 20 AAP MLAs
- Advertisement -

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం గట్టిషాకిచ్చింది. ఆప్‌కి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. 2015లో ఆప్ ప్రభుత్వం 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. దీనిని సవాల్ చేస్తూ కొంతమంది అప్పట్లో న్యాయస్ధానాన్ని ఆశ్రయించగా కోర్టు పార్లమెంటరీ సెక్రటరీల నియమకాన్ని రద్దు చేసింది.

ఇదే అంశాన్ని ప్రస్తవిస్తూ ఈసీ లాభదాయక పదవుల వ్యవహారంలో వీరిపై అనర్హత వేటు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే, వీరిపై అనర్హత వేటు పడ్డ ఆప్ ప్రభుత్వానికి జరిగే నష్టమేమి లేదు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులకు గాను ఆప్‌కు 67 మంది ఉన్నారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేస్తామని ఆప్‌ ప్రకటించింది. ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ వెల్లడించింది.

- Advertisement -