బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి మృతి..

92
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీలహరి కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఆయన సోమవారమే డిశ్చార్జ్ అయ్యారు.

అయితే, ఒక్క రోజులోనే ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో కుటుంబ సభ్యులు వైద్యుడిని ఇంటికి పిలిపించారు. పరీక్షించిన ఆయన బప్పీలహరిని తిరిగి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పలు సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ) కారణంగా మృతి చెందినట్టు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ దీపక్ నామ్‌జోషి తెలిపారు.

- Advertisement -