ట్విట్టర్ బాటలో డిస్నీ!

180
it employees
- Advertisement -

ఆర్ధిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రముఖ కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడగా తాజాగా డిస్నీ సంస్థ కూడా ఈ లీస్ట్‌లో చేరింది. ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు సంస్థ సీఈవో బాబ్ చెపాక్ వెల్లడించారు.

దీనిలో భాగంగా ఇప్పటికే ఉద్యోగుల నియామక ప్రక్రియను నిలిపివేసింది. అత్యవసర విభాగాల్లో మాత్రమే సిబ్బందిని తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక విశ్లేషణ కొనసాగుతోండగా ఇప్పటికే పని చేస్తున్న సిబ్బంది విషయంలో అనేక అంశాల్లో రివ్యూ చేస్తున్నారు.

ఇప్పటికే ట్విట్టర్, మెటా సంస్థలు ఉద్యోగుల్ని భారీ సంఖ్యలో తొలగించాయి. ట్విట్టర్ సంస్థ దాదాపు సగం మంది ఉద్యోగుల్ని తీసేయగా మెటా కూడా దాదాపు 11,000 మందిని తొలగించింది. రానున్న రోజుల్లో అమెజాన్ కూడా భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు టాక్‌.

ఇవి కూడా చదవండి..

యాదాద్రి చరిత్రలో రికార్డు..

విపక్షాలు అసత్యాలు తప్ప ఇంకా…

- Advertisement -