మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు

473
disha
- Advertisement -

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిందితులకి తగిన శిక్ష పడిందని..మా బిడ్డకు న్యాయం జరిగిందని దిశ త‌ల్లిదండ్రులు తెలిపారు. పోలీసుల ప‌నితీరు భేష్ అని …ఈ ఘ‌ట‌న‌తో మ‌రొక‌రు త‌ప్పు చేయాలంటే త‌ప్ప‌క భ‌య‌ప‌డ‌తార‌ని చెప్పారు. మరోవైపు ఘటన స్ధలాన్ని పరిశీలించారు సీపీ సజ్జనార్.

గత నెల 27న వెటర్నరీ వైద్యురాలు దిశ‌ని అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా న‌లుగురు నిందితుల‌ని పోలీసులు ప‌ది రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. డిసెంబ‌ర్ 5న సిట్ చ‌ర్ల‌ప‌ల్లి జైలులో నిందితుల‌ని విచారించింది. ఈ రోజు రీక‌న్‌స్ట్ర‌క్ష‌న్ కోసం నిందితుల‌ని ఘ‌ట‌నా స్థ‌లికి తీసుకెళ్ళ‌గా, వారు పోలీసుల‌పై ఎదురుదాడి చేయ‌డంతో ఎన్‌కౌంట‌ర్ చేశారు.

disha parents on accused Encounter…disha parents on accused Encounter

- Advertisement -