దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ హర్షం

369
cpi narayana

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై కొన్ని లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినా ఇలాంటి సమయంలో ఎలాంటి చర్చకు తావులేకుండా ఎన్‌కౌంటర్‌ చేయడం తప్పుకాదన్నారు. ఇలాంటి ఘోరమైన ఘటనలు చేసేవారికి కఠిన శిక్షలు పడాలని,పోలీసులు తీసుకున్న ఈ చర్యను సీపీఐ సమర్ధిస్తుందని చెప్పారు.

దిశను చంపేసిన ప్రాంతంలోనే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేశారు పోలీసులు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు జొల్లు శివ‌, నవీన్, చెన్న‌కేశ‌వులు, ఆరిఫ్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా ఎన్‌కౌంట‌ర్ చేశారు పోలీసులు.

cpi narayana on disha accused encounter…cpi narayana on disha accused encounter