‘డిస్కోరాజా’ నుండి మరో టీజర్ వచ్చేసింది..

460
Disco Raja Teaser
- Advertisement -

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. డైనమిక్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ డైరెక్షన్‌లో రెడీ అవుతున్న ఈ సినిమా నుండి ఇటీవలే ఓ టీజర్‌ విదడులైన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుండి మరో ఆకట్టుకునే టీజర్‌ రిలీజ్ అయింది.

ఈ టీజర్ విషయానికొస్తే.. “సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోను .. ఫైరింగ్స్ తోను యుద్ధాలు చేసి, రిటైరై ఇంట్లో వుంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటది చూడు, అది అప్పటిదాకా వాళ్లు చూసిన వయొలెన్స్ కంటే కూడా భయంకరంగా వుంటది” అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది. హీరో .. విలన్ కాంబినేషన్స్ లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచిందని చెప్పాలి. నభా నటేశ్ .. పాయల్ .. తాన్యా హోప్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -