టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకన్నాడు వివి.వినాయక్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150మూవీకి వివి. వినాయక్ దర్శకత్వం వహించారు. తాజాగా వినాయక్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. వినాయక్ కు విశాఖపట్నంలో వి మ్యాక్స్ అనే పెద్ద ధియేటర్ ఉంది. వైజాగ్ లో ఈధియేటర్ చాలా పాపులర్.
వినాయక్ తమ్ముడు ఈథియేటర్ వ్యవహారాలు చూసుకునేవాడు. వినాయక్ ఆ థియేటర్ ను అమ్మేసినట్టు తెలుస్తుంది. ఓ పెద్ద సంస్ధ వారు ఈ థియేటర్ ను భారీ రేటుకు తీసుకున్నారట. త్వరలోనే సదరు సంస్థ వి మ్యాక్స్‌ను కూల్చేసి తమ నిర్మాణాన్ని చేపట్టనుంది.
గతంలో జంట థియేటర్లు అయిన కమల్, రాజ్ కమల్‌లో ఒకదాన్ని వినాయక్ కొనుగోలు చేసి వి మ్యాక్స్‌గా మార్చాడు. తాజాగా మంచి రేటు వచ్చిన ఉద్దేశ్యంతో వినాయక్ ఈ థియేటర్‌ను విక్రయించాడని సమాచారం.