దర్శకుడు విక్రమ్ సుకుమారన్ మృతి

6
- Advertisement -

తమిళ సినీ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో మృతి చెందారు. మధురై నుంచి చెన్నై వస్తున్న టైంలో బస్సులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆయన మృతితో తమిళ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. మద యానై కొట్టం, రావణ కొట్టం వంటి చిత్రాలు తీసి ఎంత‌గానో అల‌రించారు.

ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. జస్టిన్ ప్ర‌భాక‌రన్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం వ్య‌క్తం చేస్తూ.. ఇంత త్వ‌ర‌గా వెళ్లిపోయావు.. ఆయ‌న చెప్పాల్సిన క‌థ‌లు ఎన్నో మ‌రుగున ప‌డిన‌ట్టే అని ట్వీట్ చేశాడు.

ఇక శంతను కూడా విక్ర‌మ్‌కి నివాళులు అర్పిస్తూ.. త్వ‌ర‌గా వెళ్లిపోయావ్ మిత్ర‌మా.. నీ నుండి నేను చాలా నేర్చుకున్నాను. నీతో గ‌డిపిన ప్ర‌తి క్ష‌ణం జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకు ఇలా మా అంద‌రిని వ‌దిలి త్వ‌ర‌గా వెళ్లిపోయావ్. నిన్ను ఎంతో మిస్ అవుతాము. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ శంతను ట్వీట్ వేశారు.

Also Read:ఓటీటీలో ‘చౌర్య పాఠం’..

- Advertisement -