స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరగా నటించిన సినిమా నాపేరు సూర్య నాఇల్లు ఇండియా. ఈసినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరక్టర్ గా మారి ఈసినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా తర్వాత ఇంతవరకూ అల్లు అర్జున్ ఏ సినిమాకు ముహుర్తం ఖరారు చేయలేదు. విక్రమ్ కుమార్ తో బన్నీ ఓ సినిమా చేయనున్నాడని గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. విక్రమ్ కుమార్ కథను సిద్దం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది.
అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం చూస్తే బన్నీ, విక్రమ్ కుమార్ ల సినిమా పట్టాలెక్కెటట్టు లేదనిపిస్తొంది. ఫస్ట్ మొత్తం పూర్తిగా రాసకున్నాడని..అయితే సెకాండాఫ్ విషయానికొచ్చే సరికి బన్నీ కొన్నిమార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. దింతో విక్రమ్ కుమార్ ఈప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టెశాడని ఫిలీంనగర్ వర్గాల టాక్. అందుకే బన్నీ ఈప్రాజెక్ట్ గురించి ఎక్కడా మాట్లాడటం లేదని చెబుతున్నారు. ఈ కథ సెట్ కాకపోవడంతో విక్రమ్ కుమార్ మరో కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం.
కాగా బన్నీ తన తరువాతి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్నాడు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమా పూర్తయ్యే సిరకి ఇంకా మూడు నెలలు పట్టనుంది..అంతలోపే వేరే దర్శకుడితో సినిమా చేసేందుకు ప్లాన్ వేశాడు బన్నీ. అందకోసం ఓ యువదర్శకుడితో బన్నీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్. చూడాలి అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా ఎవరితో చేయనున్నాడో.