ప్రముఖ సినీ దర్శక, నిర్మాత విజయ బాపినీడు(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుద్విశ్వాస విడిచారు. టాలీవుడు అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి,శోభన్ బాబులతో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించి మంచిపేరుతెచ్చుకున్నారు.
చిరంజీవి-బాపినీడు కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఆల్‌టైమ్ హిట్ మూవీలలో ఒకటిగా నిలిచాయి. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఖైదీ నెంబర్ 786, మగధీరుడు, సుమంగళి,వాలుజడ తోలు బెట్లు వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.
సెప్టెంబర్ 22 , 1936లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని చాటపర్రు గ్రామంలో జన్మించారు.బీఏ చదివిన ఆయన ఇండస్ట్రీలోకి రాకముందు విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేశారు.
1976 యవ్వనం కాటేసింది అనే సినిమా ద్వారా నిర్మాతగా మారారు. బాపినీడు మృతి పట్ల టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రమఖులు బాపినీడు మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.