మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీరరాఘవ సినిమాను తీస్తున్నాడు. రచయితతో కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ రేంజ్ కు ఎదిగాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. టాప్ డైరెక్టర్ లతో సినిమా తీసి మంచి హిట్లు అందించాడు. త్రివిక్రమ్ ఆఖరి సినిమా అజ్ఞాతవాసి ఘోర పరాజయం కావడంతో ఎక్కువగా టివిల్లో కనిపించలేదు. ఇక తాజగా ఓ ఇంటర్యూలో అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ పై స్పందించాడు త్రివిక్రమ్. తనపై నమ్మకంతోనే పవన్ ఈ సినిమాను చేశారన్నారు. సినిమా ప్లాప్ అవుతుందని అసలు ఉహించలేదన్నారు.
ఈసినిమాను డిస్ట్రీబ్యూటర్లు రూ.90కోట్లు కొనుగోలు చేశారన్నారు. మొత్తం వచ్చిన లాభం రూ.60కోట్లు అన్నారు. తాను పవన్ కళ్యాణ్, నిర్మాత ముగ్గురం కలిసి రూ.25 కోట్లు డిస్ట్రీబ్యూటర్లకు ఇచ్చేశామన్నారు. మనల్ని నమ్ముకున్న డిస్ట్రీబ్యూరట్లకు అన్యాయం చేయవద్దని ఈనిర్ణయం తీసుకున్నామన్నారు. అజ్ఞాతవాసి ప్లాప్ తనపై చాలా ఎఫెక్ట్ చూపించిందన్నారు. సినిమా స్క్రీప్ట్ విషయంలో పలు తప్పులు చేశానన్నారు. ఎమోషన్ లేకుండా సినిమాను తీసి తప్పుచేశానన్నారు. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో తగు జాగ్రత్తలు తీసుకున్నా అని తెలిపారు.
ప్రేక్షకుడికి అర్ధమయ్యే రీతిలో సినిమా తియలేదన్నారు. కమర్షియల్ ప్రేక్షకులను మాత్రమే దృష్టిలో ఉంచుకుని అజ్ఞాతవాసి కథ రాశానన్నారు. ఓ రాజు, ఓ రాజ్యం అంటూ అందరికీ తెలిసిన విధంగా కథను ప్రారంభిస్తే, ప్రేక్షకుడు త్వరగా లీనమైపోయుండేవారన్నారు. కార్పొరేట్ నేపథ్యంలో బిజినెస్ పేజీకి మాత్రమే పరిమితమయ్యే న్యూస్ ఐటమ్ వంటి కథను తీసుకున్నానని, అందుకే ప్రేక్షకులు తిరస్కరించారన్నారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ కు స్పీచ్ లు మీరే రాస్తారు అని అడగగా..ఆయనకు స్పీచ్ లు రాసే అదృష్టం నాకూ లేదన్నారు. ఈయనకు స్పీచ్ ఏవరూ రాయనవసరం లేదన్నారు. ఆయన బాగా రాయగలరని, ఓ పుస్తకం చదివిన వెంటనే, దానిపై అభిప్రాయాన్ని రాసుకునే పవన్ కు తాను ప్రసంగాలను రాసివ్వడం ఏంటని చెప్పారు.