బన్నీ కోసం ఆర్య 3 రెడీ..!

333
allu arjun

స్టైలీష్‌ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య, ఆర్య2 సినిమాలు గుర్తుండే ఉంటాయి. బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయి ఈ రెండు సినిమాలు. తాజాగా వీరి కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే తాజాగా బన్నీతో సినిమాకు సంబంధించి తన మనసులో మాటను బయటపెట్టారు సుకుమార్‌.

ఆర్య 3 స్క్రిప్ట్ రెడీగా ఉందని అయితే ఈ కథను బన్నీకి వినిపించలేదన్నారు. తను ఓకే అంటే షూట్‌కి వెళ్లిపోతామని చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం సుకుమార్ -అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభం కానుంది.