సాహొ డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్ధం.. ఫోటోలు

359
Director Sujeeth
- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘రన్ రాజా రన్’ సినిమాతో పరిచయమైన డైరెక్టర్ సుజీత్. ఆ తర్వాత తన రెండవ మూవీనే ఏకంగా డార్లింగ్ ప్రభాస్తో పాన్ ఇండియా మూవీ ‘సాహో’ రూపొందించి ఒక్కసారిగా స్టార్ అనిపించుకున్నాడు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా సుజీత్ కి మాత్రం మంచి పేరు తెచ్చింది. అయితే ప్రస్తుతం సుజీత్ మెగాస్టార్ చిరంజీవి అప్కమింగ్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్ స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ లూసిఫర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నాడట ఈ సాహో దర్శకుడు.

తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్నాడు. తను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రవల్లిక అనే యువతిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా వీరి నిశ్చితార్ధం గోల్కొండ రిసార్ట్స్‌లో కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా జరిగింది. ఇక సుజిత్ చేసుకోబోయే ప్రవల్లిక విషయాకిస్తే.. ఈమె వృత్తి రీత్యా డాక్టర్ అని చెబుతున్నారు. అంతేకాదు స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తోంది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరు ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు.

- Advertisement -