సీఎం జగన్‌తో భేటీపై రాజమౌళి స్పందన..

137
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. మంగళవారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ విలేకర్లతో సమావేశమైంది. అయితే ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను రాజమౌళి, నిర్మాత దానయ్య కలిసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ.. సీఎం జగన్ ను కలిసిన తర్వాత తమకు ఎంతో తృప్తి కలిగిందని అన్నారు. జగన్ చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఏపీ సర్కారు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది. దాని అర్థం బెనిఫిట్‌ షో అనే కదా. ఐదు షోలు నడిచినన్ని రోజులు బెనిఫిట్‌ షోస్‌ ఉన్నట్లే అని రాజమౌళి అన్నారు.

ఏపీ సీఎం జగన్‌ క్లియర్‌గా ఉన్నారు. ఒక జీవో పాస్‌ చేశాం. జీవో రూల్‌ ఏంటో అలాగే నడుస్తుంది. ‘మీరు పెద్ద బడ్జెట్‌ పెట్టి సినిమా తీశారు. మీకు నష్టం రాకూడదని కోరుకుంటున్నాను’ అని జగన్‌ చెప్పారు. అదే సమయంలో ప్రేక్షకులపై ఎక్కువ భారం పడకూడదన్నారు. నిర్మాతలకు నష్టం రాకుండా.. ప్రేక్షకులకు భారం కాకుండా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారని రాజమౌళి పేర్కొన్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ అనేది అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల జీవిత చరిత్ర కాదని… ఇదొక ఫిక్షన్ మూవీ అని జక్కన్న తెలిపారు.

అలాగే ఉక్రెయిన్ గురించి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ను ఉక్రెయిన్ లో అద్భుతంగా చేశామని తెలిపారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ దేశంలో యుద్ధం వస్తుందని కనీసం ఊహించలేదని చెప్పారు. షూటింగ్ టైమ్ లో ఉక్రెయిన్ ప్రజలు తమకు ఎంతో సహకరించారని తెలిపారు. అక్కడి వంటకాలు, వారి కల్చర్ తనకు ఎంతో నచ్చాయని చెప్పారు. ఇలాంటి యుద్ధ వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని రాజమౌళి అన్నారు.

- Advertisement -