ప్రసిద్ధ మలయాళ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ (69) దీర్ఘకాలిక అనారోగ్యంతో శనివారం ఎర్నాకులం జిల్లాలోని త్రిప్పునిత్తురలో కన్నుమూశారు. నిర్మాతగా కూడా పేరొందిన శ్రీనివాసన్ తన కెరీర్‌లో 225కి పైగా చిత్రాల్లో నటించారు.
వడక్కునొక్కియంత్రం, చింతావిష్టయాయ శ్యామల వంటి కాలాతీత చిత్రాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. మలయాళ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సినీ వర్గాలు కొనియాడుతున్నాయి.
శ్రీనివాసన్ మృతితో మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా ద్వారా నివాళి అర్పిస్తూ భారతీయ సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభావంతుల్లో శ్రీనివాసన్ ఒకరు. తన సినిమాల ద్వారా ఆయన పంచిన నవ్వులు, ఆలోచనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంటూ భావోద్వేగంగా స్పందించారు.
Also Read:శ్రీశైలంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్

