ప్రముఖ దర్శకుడికి కరోనా పాజిటివ్‌..

31

సినీ సెలబ్రిటీలను కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎందరో దీని బారినపడ్డారు. తాజాగా ప్రముఖ తమిళ డైరెక్టర్‌ ఈ మహమ్మారి బారిపడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. ‘నేను కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నాను. ఈ పరీక్షల్లో నాకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఈ మధ్య నన్ను కలిసిన వాళ్ళందరూ కరోనా పరీక్షలు చేయించుకుని, ఐసోలేషన్‌లో ఉండాల ని కోరుతున్నా’ అని సెల్వరాఘవన్‌ సోషల్‌ మీడియా ద్వారా కోరారు. ప్రస్తుతం ఈయన దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా రాణిస్తున్న విషయం తెల్సిందే.