ఎన్టీఆర్ వెన్నుపోటుపై వ‌ర్మ స‌ర్వే..

284
ram gopal varma
- Advertisement -

ద‌ర్శ‌కుడు క్రిష్ ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై ఎన్టీఆర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. క‌థానాయ‌కుడు , మ‌హానాయ‌కుడు అని రెండు భాగాలుగా తెర‌కెక్కించారు. మొద‌ట‌గా క‌థానాయ‌కుడు సినిమాను జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఎన్టీఆర్ జివిత చ‌రిత్ర‌పై బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నారు.

ntr

ఇటివ‌లే వ‌ర్మ త‌న సినిమాలోనుంచి విడుద‌ల చేసిన వెన్నుపోటు పాట ఎపీలో హాట్ టాపిక్ గా మారింది. కొంత‌మంది టీడీపీ నాయ‌కులు వ‌ర్మ‌పై కేసులు కూడా పెట్టారు. తాజాగా మ‌రోసారి ఆయ‌న ఈసినిమా పై ట్వీట్ట‌ర్ ద్వారా స్పందించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారిలో ఎవ‌రిది పెద్ద వెన్నుపోటో చెప్పాల‌న్నారు.

rgv

వైస్రాయ్ గ్యాంగ్, నాదెండ్ల భాస్కర్ వెన్నుపోట్లలో ఏది పెద్ద వెన్నుపోటో చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు. ట్వీట్ట‌ర్లో ఆయ‌న పెట్టిన పోస్ట్ పై చాలా మంది అభిమానులు ఆయ‌న‌కు సమాధానం ఇచ్చారు. వైస్రాయ్ గ్యాంగ్ వెన్నుపోటు పెద్ద వెన్నుపోటని 69 శాతం ప్రజలు, మరో 31 మంది మాత్రం నాదెండ్ల భాస్కరరావు చేసిందే పెద్ద వెన్నుపోటని చెప్పిన్నట్లు వెల్ల‌డించారు వ‌ర్మ‌. తాజాగా ఈసర్వే ఫ‌లితాల‌ను ఆయ‌న ట్వీట్ట‌ర్లో పోస్ట్ చేశారు.

- Advertisement -