కాంగ్రెస్ పార్టీ పాకిస్ధాన్ లో పోటీ చేయాలిః వర్మ

406
RGV Rahul Sonia
- Advertisement -

వివాదాస్పద  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతాడు. గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసిన వర్మ..తాజాగా కాంగ్రెస్ పార్టీకి చురకలు అంటించారు. వర్మ చేసిన ఈవ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రామ్ గోపాల్ వర్మ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ట్వీట్టర్ లో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ .. కాశ్మీర్ విషయంలో ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా చేస్తున్న వాదనను ఖండించాడు. దేశ ప్రజలందరు ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని స్వాగతిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందన్నారు.

జమ్మూ కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ నినాదం చూస్తుంటే ఒక వేళ ఇప్పడు పాకిస్ధాన్ లో ఎన్నికలు గనుక జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం తనుకు ఉందని చెప్పారు. అంతేకాదు కాశ్మీర్ ఇష్యూ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇపుడిపుడే జ్జానోదయం అయినట్టు కనిపిస్తోంది. మన దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కాబట్టి ఆ పార్టీ తట్ట బుట్టా సర్దుకుని పాకిస్థాన్‌కు వెళ్లిపోవడం బెటర్ అంటూ కామెంట్ చేసాడు. వర్మ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -