‘కెజిఎఫ్’ మూవీపై వ‌ర్మ కామెంట్..

366
kgf RGV
- Advertisement -
క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ న‌టించిన సినిమా కెజిఎఫ్. ఈమూవీ క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో విడులైంది. డిసెంబ‌ర్ 21వ తేదిన విడుద‌లైన ఈమూవీ మంచి స‌క్సెస్ ను అందుకుంది. ప్ర‌పంచవ్యాప్తంగా భారీ వసూళ్ల‌తో దూసుకుపోతుంది. ప్ర‌శాంత్ నిల్ ఈమూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే తెలుగులో కూడా ఈమూవీ బాక్సాఫిస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఈసినిమాతో పాటు హిందీలో షారుఖ్ ఖాన్ న‌టించిన జీరో సినిమా కూడా విడుద‌లైంది.
kgf
తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం జీరో మూవీ కంటే కెజిఎఫ్ మూవీ ఎక్కువ సూళ్ల‌ను రాబ‌ట్టింద‌ని తెలుస్తుంది. తొలిరోజు ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.18 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈమూవీపై సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. సినిమాకు ప్రాంతీయ అడ్డంకులు ఉండవని, మంచి సినిమా ఎక్కడైనా తీయగలరని, ఎక్కడైనా అలాంటి సినిమాలు సక్సెస్ సాధిస్తాయని మొదట ‘బాహుబలి’ సినిమా నిరూపించింది. ఆ తరువాత ‘2.0’.. ఇప్పుడు కన్నడ సూపర్ హిట్ ‘కెజిఎఫ్’లతో నిరూపితమైంది. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు” అంటూ ట్విట్టర్ లో తెలిపాడు.
- Advertisement -