డాషింగ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తనయుడు ఆకాశ్ పూరీ, నేహా శెట్టి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం మెహబూబా. తనయుడు పూరీ ఆకాశ్ కెరీర్‌పై దృష్టిపెట్టిన పూరీ స్వయంగా తనయుడి రెండవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1971లో జరిగిన ఇండోపాక్ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ రూపొందుంతుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని పూరీ రిలీజ్ చేశారు. ఇందులో ఆకాశ్ వైవిధ్యమైన నటనలో కనిపిస్తున్నాడు. ఇంటెన్స్ రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీని పూరీ తెరకెక్కిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర్రలలో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశారు. ఈ రోజు విడుదలైన ట్రైలర్‌తో ప్రేక్షకులలో పూరీ ఈ చిత్రంపై ఆసక్తిని ఏర్పర్చారు. ఈ వేసవిలో మొహబూబాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. లవ్ వార్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని చిత్ర యూనిట్ చెబుతుంది. మీరు ట్రైలర్ పై ఓ లుక్కెయండి మరీ.